Iran | ఇరాన్ ఎవరికీ తలవంచబోదన్న పెజెష్కియాన్.. బాహుబలి మూవీ వీడియోతో కౌంటర్
Iran : ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎవరికీ తలవంచబోదని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
Iran : ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎవరికీ తలవంచబోదని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ)లో పెజెష్కియాన్ మాట్లాడారు. ఈ సందర్బంగా తాజా యుద్ధ పరిస్థితిపై మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల్ని తప్పుబట్టారు.
ఇరాన్‌కు తీవ్రవాదాన్ని ఆపాదించడాన్ని కూడా ఆయన విమర్శించారు. తప్పు చేసిన వారే తమపై అలాంటి ఆరోపణలు చేస్తారన్నారు. టెర్రిస్టులే తమను టెర్రరిస్టు దేశం అని విమర్శిస్తారన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ బాహుబలి సినిమాలోని వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని కాలకేయులతో యుద్ధం చేసే వీడియోను ఇరాన్ ఎంబసీ పోస్టు చేసింది. కాలకేయులను ఓడించేందుకు బాహుబలి నిలబడ్డట్లుగానే.. తాము కూడా మాతృదేశం కోసం నిలబడతామని, రక్తాన్ని చిందించేందుకు సిద్ధమని పోస్టులో పేర్కొంది.
Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: “Will never bow our head or bend the knee”
Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q
— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026
ఇరాన్ ఎవరిముందు తలవంచబోదని, మోకాళ్లపై కూర్చోదని తమ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఐరాసలో చెప్పడాన్ని కూడా పోస్టులో వివరించింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పాశ్చాత్య దేశపు శతృవులను కాలకేయులతో పోల్చొద్దని కొందరు సూచిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా క్లిప్‌ను ఇంటర్నేషనల్ లెవల్లో ఎలివేట్ చేయడంపై ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

