Vemulawada | వేములవాడ, మార్చి 6: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఎలవేని ప్రశాంత్ (32) హఠాన్మరణం చెందాడు.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన ప్రశాంత్ గురువారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. దాంతో రాత్రికి రాత్రే కరీంనగర్ తరలించారు. కానీ లాభం లేకుండాపోయింది. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.