Zinedine Zidane | ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌కు కొత్త కోచ్.. వరల్డ్‌కప్ విజేతకు బాధ్యతలు..!
Zinedine Zidane : ఫుట్‌బాల్ దిగ్గజం జినెదినె జిదానే (Zinedine Zidane) ఫ్రాన్స్ కోచ్‌గా నియమితులయ్యాడు. త్వరలో మొదలయ్యే యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌తో కోచ్‌గా జిదానేకు తొలి పరీక్ష ఎదురవ్వనుంది.
Zinedine Zidane : ఫుట్‌బాల్ దిగ్గజం జినెదినె జిదానే (Zinedine Zidane) ఫ్రాన్స్ కోచ్‌గా నియమితులయ్యాడు. వరల్డ్‌కప్ విజేత, మాజీ కెప్టెన్ అయిన జిదానె జాతీయ జట్టుకు కోచ్ అవుతారని ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. తమదేశ వెటరన్ ఆటగాడికి కోచింగ్ పదవి కట్టబెట్టిన విషయాన్ని మంగళవారం ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య(FFF) వెల్లడించింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ సెమీస్‌లోనే వెనుదిరగడంతో కోచ్‌గా వైదొలిగిన డిడియర్ డెస్చాంప్స్ స్థానంలో జిదానే మార్గనిర్దేశం చేయనున్నాడు.
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కోచ్‌గా డిడియర్ డెస్చాంప్స్ ప్రస్థానం ముగిసింది. 14 ఏళ్లుగా కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన అతడి స్థానంలో వెటరన్ ఆటగాడు జినెదినె జిదానే నియమితులయ్యాడు. 1998ల మొదటిసారి వరల్డ్‌కప్ గెలుపొందిన జట్టులో డెస్చాంప్స్, జిదానే సభ్యులు. ఇటీవలే ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో కిలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ పరాజయంతో కోచ్ పదవిని వదులుకున్నాడు డిడియర్. దాంతో, తదుపరి కోచ్‌గా మాజీ కెప్టెన్ జినెదినే జిదానే ఎంపికయ్యాడు.
Bienvenue au nouveau sélectionneur de l’équipe de France masculine de football, monsieur Zinedine Zidane 🫡 https://t.co/V7vw87SLTk
— Equipe France (@EquipeFRA) July 28, 2026
156 గోల్స్
ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన జిదానే 2006 ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం రిటైరయ్యాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను భయపెట్టిన అతడు.. 803 మ్యాచుల్లో 156 గోల్స్ కొట్టాడు. వీడ్కోలు అనంతరం 2021లో రియల్ మాడ్రిడ్ కోచ్‌గా వైదొలిగిన జిదానే.. ఫ్రాన్స్ జట్టుకు కోచింగ్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఐదేళ్లకు అతడికి అవకాశం లభించింది. త్వరలో మొదలయ్యే యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌తో కోచ్‌గా జిదానేకు తొలి పరీక్ష ఎదురవ్వనుంది.
Zinedine Zidane has been unveiled as France’s new manager, ending a five-year break from coaching after leaving Real Madrid in 2021.
He has signed a four-year deal after France’s fourth-place finish at the World Cup pic.twitter.com/XGONWg2YSA
— The National (@TheNationalNews) July 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

