జైపూర్: భారీగా కురిసిన వర్షం నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. (Man Swept Away In Floodwater) అతడ్ని కాపాడేందుకు పలువురు ప్రయత్నించారు. చివరకు ఒక హోటల్ సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. జూలై 18న ఆ నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాతో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నీరు వీధుల్లో వరదగా ప్రవహించింది. దర్గా నిజాం గేట్ బయట చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్న పర్యాటకుడు అదుపుతప్పి నీటిలో పడ్డాడు. వర్షం నీటి ప్రవాహానికి అతడు కొట్టుకుపోయాడు.
కాగా, గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఒక హోటల్ సిబ్బంది ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మరికొందరు కలిసి అతడ్ని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
This morning: Heavy rain caused flash flooding. A young man was swept away by strong currents in Ajmer, Rajasthan, India. July 19, 2025. pic.twitter.com/NsyWEha4F7
— Weather Monitor (@WeatherMonitors) July 19, 2025
Also Read:
Girl set on fire | ఒడిశాలో మరో దారుణం.. అమ్మాయికి నిప్పంటించిన ముగ్గురు
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?