Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Snake Catcher Dies by Snake bite) మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాఘోగఢ్‌లోని కాట్రా మొహల్లా ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల దీపక్ మహాబర్ పదేళ్లుగా పాములు పడుతున్నాడు. ఎవరైనా తమ ఇల్లు, షాపు లేదా కార్యాలయంలో పాము ఉందని అతడికి ఫోన్ చేయగానే అక్కడి వెళ్లేవాడు. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేవాడు. ఇలా పదేళ్లకుపైగా వందల సంఖ్యలో పాములు పట్టాడు. ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకునేవాడు కాదు. ఉచితంగానే పాములు పట్టి సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టేవాడు. జేపీ యూనివర్సిటీలో పాములు పట్టే వ్యక్తిగా పాపురల్ అయ్యాడు.
కాగా, జూలై 14న రాఘోగఢ్‌లోని బర్బత్పురాలో ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లు దీపక్‌కు ఫోన్ వచ్చింది. దీంతో బైక్‌పై అక్కడకు చేరుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. అయితే కుమారుడి స్కూల్ ముగిసే సమయం కావడంతో ఆ పామును మెడలో వేసుకుని బైక్‌పై అక్కడకు వెళ్లాడు. కుమారుడితో కలిసి బైక్‌పై ఇంటికి చేరుకున్నాడు.
మరోవైపు దీపక్ మెడలో పాము ఉండటం చూసి అతడి ఇంటి వద్ద కొందరు వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న ఆ పాము అతడి చేతిపై కాటు వేసింది. దీంతో దీపక్ ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి సహాయం కోరాడు. తొలుత రాఘోగఢ్‌లోని స్థానిక ఆసుపత్రికి అతడ్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుణాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కాగా, సోమవారం సాయంత్రం దీపక్ పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. దీంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ రాత్రికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు దీపక్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున అతడు మరణించాడు.
పోస్ట్‌మార్టం తర్వాత దీపక్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాటుకు ముందు మెడలోని పాముతో బైక్‌పై ఉన్న దీపక్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MP: गुना में सांप के काटने से सर्प मित्र दीपक महावर की मौत, पकड़ने के बाद गले में डालकर ले जा रहा था घर, देखें वीडियो #Cobra #Snake #SnakeCathcer #Guna #MadhyaPradesh #TheSootr pic.twitter.com/cJj2SbFpPE
— Abhishek raghav (@Abhishek4media) July 16, 2025
Also Read:
Watch: ఫొటో కోసం పోజులియ్యపోయిన ఆలయ కమిటీ చైర్మన్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

