భోపాల్: గుడి వద్ద జరుగుతున్న పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. (Photo bid Goes Wrong) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిత్రగుప్త ఆలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ ఆ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా ఫొటోలకు పోజులిచ్చేందుకు ప్రయత్నించారు. తట్టలో ఉన్న కాంక్రీట్ మెటీరియల్ను కార్మికురాలి నుంచి తీసుకుని లోతైన గోతిలో పోశారు.
కాగా, ఫొటో సరిగా రాలేదని కెమెరా వ్యక్తి తెలిపాడు. మరో ఫొటో కోసం ప్రయత్నిద్దామని చెప్పాడు. దీంతో మరో కార్మికుడి నుంచి తట్టను ప్రఫుల్ శ్రీవాస్తవ అందుకున్నారు. కాంక్రీట్ మెటీరియల్ గోతిలో పోస్తుండగా జారి అందులో పడ్డారు. ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘సేవలో నాటకీయత వద్దు. సింపుల్గా ఉండండి’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
ये फोटो खिंचाना भी एक मानसिक बीमारी हे..😂
अब ये देखिए न
फोटो के चक्कर में भाई साहब 6 फिट गहरे गड्ढे में गिरे..😂फोटो के साथ चोटें भी आ गई 😭😂
वो तो शुक्र है गंभीर चोट नहीं आई..📹 pic.twitter.com/8sL0NEily6— राष्ट्रवादी 🚩सनातनी🚩 HiNdU (@HiNdU05019434) July 15, 2025
Also Read:
Watch: ఒడిశాలో మరో అమానుషం.. మరో జంటను నాగలికి కట్టి దున్నించిన వైనం