భువనేశ్వర్: మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట పెళ్లి చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి కట్టి దున్నించారు. (Couple Made To Plough Field) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. కోరాపుట్ జిల్లాకు చెందిన గిరిజన జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఒకే గోత్రం, ఇంటి పేరున్న వారిద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తున్నారు.
కాగా, సామాజిక కట్టుబాటును వ్యతిరేకించిన ఆ జంటకు గ్రామస్తులు ప్రజా కోర్టులో శిక్ష విధించారు. ఆదివారం శుద్ధి ఆచారంలో భాగంగా చెప్పుల దండలు ధరించాలని బలవంతం చేశారు. గ్రామ కూడలి చుట్టూ వారిని ఊరేగించారు. ఆ తర్వాత ఎద్దుల మాదిరిగా నాగలికి కట్టి అక్కడ దున్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कपल को बैलों की तरह बांधकर घुमाया…
ओडिशा के कोरापुट जिले में इंसानियत को शर्मसार करने वाली एक घटना सामने आई है, जहां एक ही गोत्र में शादी करने पर एक प्रेमी जोड़े को ग्रामीणों ने बैलों की तरह जुए से बांधकर सज़ा दी. यह मामला नारायणपटना ब्लॉक के पेडा इटिकी गांव का है, जहां कंगारू… pic.twitter.com/OibF2R2FlL
— NDTV India (@ndtvindia) July 14, 2025
మరోవైపు పొరుగున ఉన్న రాయగడ జిల్లాలో కూడా ఇలాంటి అమానుషం జరిగింది. కంజామఝిరా గ్రామానికి చెందిన యువకుడు తన బంధువైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఒకే ఇంటి పేరున్న వారిద్దరూ పెళ్లి చేసుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. గిరిజన సంప్రదాయాన్ని, కట్టుబాట్లను ఉల్లంఘించిన వారిద్దరికి సామాజిక శిక్ష విధించారు. కొత్తగా పెళ్లైన జంటను ఎడ్ల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఆ తర్వాత ఆలయంలో శుద్ధి ఆచారాలు జరిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ కలకలం రేపింది.
When culture becomes vulture !
A scene from Rayagada district of #Odisha ! A boy n girl who love each other are forced to plough in public just like bullocks as punishment !
It’s inhuman indeed ! should be stopped @Ashok_Kashmir @irfhabib @BabelePiyush @amityadavbharat pic.twitter.com/4w2hNaMGy5— Amiya_Pandav ଅମିୟ ପାଣ୍ଡଵ Write n Fight (@AmiyaPandav) July 11, 2025
Also Read:
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్
Watch: మహిళ జుట్టు పట్టుకున్న మగ గొరిల్లా.. ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?