ముంబై: ఒక మంత్రి తన ఇంట్లోని బెడ్రూమ్లో స్మోక్ చేశారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆయన బెడ్ సమీపంలో ఉన్న బ్యాగులో డబ్బుల కట్టలున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Sena MLA Sanjay Shirsat) బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. శివసేన షిండే వర్గానికి చెందిన సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ శిర్సాత్ తన ఇంట్లో బెడ్‌పై కూర్చొన్నారు. ఒక చేతిలోని సిగరెట్‌ను స్మోక్ చేస్తూ మరో చేతిలోని మొబైల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ బెడ్ పక్కన నేలపై ఉన్న తెరిచిన ట్రావెల్ బ్యాగ్ నిండా నోట్ల కట్టలు కనిపించాయి. మరో ట్రావెల్ బ్యాగ్ కూడా అక్కడ ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాగా, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వీడియో చూడాలని కోరారు. ‘దేశంలో ఏం జరుగుతోంది? మహారాష్ట్ర మంత్రికి సంబంధించిన ఈ వీడియో చాలా చెబుతోంది’ అని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్యాగ్ చేశారు.
మరోవైపు మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాత్ సంపద రూ.31 కోట్లకు పెరుగడంపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఆయనకు నోటీస్ అందింది. ఒక రోజు తర్వాత ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంపై ఆయన స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. ‘వీడియోలో కనిపిస్తున్న ఇల్లు నాదే. అది నా ఇంటి బెడ్రూమ్. ఆ వీడియోలోని కుక్క కూడా నాదే. నేను రిలాక్స్‌గా కూర్చున్నా. డబ్బు ఉంటే, దానిని ఉంచడానికి నా ఇంట్లో అల్మారాలు ఉన్నాయి. ఇలా బ్యాగ్‌లో నేను డబ్బు ఎందుకు ఉంచుకోవాలి?’ అని ప్రశ్నించారు.
కాగా, శివసేన ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెడుతున్నారని మంత్రి సంజయ్ శిర్సాత్ ఆరోపించారు. ‘నా ఇల్లు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. చాయ్, స్నాక్స్ కోసం అందరూ వస్తారు. పార్టీ కార్యకర్తలు వచ్చి సందర్శిస్తారు. ఎవరి కోసమో ఇలా చేసి ఉంటారు’ అని ఆరోపించారు.
మరోవైపు కొంతమంది ఫిర్యాదు వల్ల తనకు ఐటీ నోటీస్ వచ్చిందని మంత్రి సంజయ్ శిర్సాత్ తెలిపారు. ఆ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి సమయం అడిగినట్లు చెప్పారు. ‘కొంతమందికి నాతో సమస్య ఉంది. నేను వారికి సమాధానం ఇస్తా. వ్యవస్థ దాని పని చేస్తుంది. నాకు ఎలాంటి సమస్య లేదు. నేను ఎలాంటి ఒత్తిడిలో లేను’ అని ఆయన అన్నారు.
Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025
#WATCH | Mumbai, Maharashtra: On a purported viral video showing him sitting beside a bag filled with cash, Maharashtra Minister Sanjay Shirsat says, “This is a well-thought-out conspiracy. I am sitting comfortably in my house, and my dog is sitting as well. Someone has recorded… pic.twitter.com/SwPiZVmnWe
— ANI (@ANI) July 11, 2025
Also Read:
Airport Wall Collapses | రూ.500 కోట్ల ప్రాజెక్టుకు పగుళ్లు.. కూలిన ఎయిర్పోర్ట్ గోడ