ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. ఒక హిందూ వ్యాపారిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. కాంక్రీట్ స్లాబ్‌తో కొట్టి చంపారు. (Lynching Hindu trader in Bangladesh) చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత అతడి మృతదేహంపై డ్యాన్స్ చేశారు. ఈ సంఘటనపై బంగ్లాదేశ్‌లోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 9న ఓల్డ్ ఢాకా ప్రాంతంలోని మిట్‌ఫోర్డ్ హాస్పిటల్ ముందు ఈ సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) యూత్ ఫ్రంట్‌కు చెందిన కార్యకర్తలు హిందువైన స్క్రాప్ డీలర్ లాల్ చంద్ సోహాగ్‌పై దాడి చేశారు. కాంక్రీట్ స్లాబ్‌తో మోది అతడ్ని హత్య చేశారు. మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత సోహాగ్ మృతదేహంపై డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పలు యూనివర్సిటీల్లోని హిందూ విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం మూక హింసను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.
మరోవైపు లాల్ చంద్ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 19 మందిని నిందితులుగా, సుమారు 20 మంది గుర్తు తెలియని వారిని అనుమానితులుగా పేర్కొన్నారు. లాల్ చంద్ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనపై బీఎన్పీ స్పందించింది. లాల్ చంద్ సోహాగ్‌ను కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొంది.
Also Read:
BJP Leader Shot Dead | బీజేపీ నేత హత్య.. కాల్పులు జరిపి చంపిన దుండగులు
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు