BJP Leader Shot Dead | బీజేపీ నేత హత్య.. కాల్పులు జరిపి చంపిన దుండగులు
BJP Leader Shot Dead | మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
పాట్నా: మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. (BJP Leader Shot Dead) బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ నేత సురేంద్ర కేవత్ శనివారం రాత్రి భోజనం తర్వాత షేక్‌పురా గ్రామంలోని పొలం వద్దకు బైక్‌పై వెళ్లారు. నీటి పంపును బంద్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నారు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సురేంద్ర కేవత్పై గన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.
కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సురేంద్రను పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను పాట్నాలోని ఆయన ఇంటి బయట కాల్చి చంపిన వారం తర్వాత బీజేపీ నేత సురేంద్రపై కాల్పులు జరిపి హత్య చేయడం కలకలం రేపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
Also Read:
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Watch: కొత్తగా పెళ్లైన జంటను కాడికి కట్టి.. పొలం దున్నించిన గ్రామస్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

