కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించారు. (Trinamool, BJP leaders share drinks) రాత్రివేళ పార్కు వద్ద చాలాసేపు రెండు కార్లు ఆగి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాటి వద్దకు వెళ్లి పరిశీలించగా ఇది బయటపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాత్రివేళ అపల్‌చంద్ అటవీ ప్రాంతం సమీపంలో రెండు కార్లు చాలాసేపు ఆగి ఉన్నాయి. అనుమానించిన స్థానికులు ఆ వాటి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఒక కారు లోపలున్న వారు బయటకు రావాలని డిమాండ్ చేశారు.
కాగా, టీఎంసీ పంచాయతీ సమితి అధ్యక్షుడు, జిల్లా స్థాయి నాయకుడు పంచనన్ రాయ్ కారులో అతడి డ్రైవర్‌తోపాటు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దీపా బానిక్ అధికారి ఉన్నారు. వారంతా కలిసి అందులో మద్యం సేవిస్తున్నారు. కారులో ఉన్న బీజేపీ నాయకురాలు జనాన్ని చూసి మద్యం గ్లాస్‌ను ముందు సీటులో ఉంచింది. ఆ తర్వాత కారు నుంచి కిందకు దిగింది. తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు టీఎంసీ నేత రాయ్, అతడి డ్రైవర్‌ను స్థానికులు నిలువరించారు. కొంతసేపటి తర్వాత డ్రైవర్‌తో కలిసి కారులో అక్కడి నుంచి ఆయన కూడా వెళ్లిపోయాడు. అయితే ప్రత్యర్థి పార్టీలకు చెందిన టీఎంసీ నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఈ సంఘటనపై ఆ రెండు పార్టీలు స్పందించలేదు.
তৃণমূল বিজেপি একসঙ্গে বন্ধের বিরোধিতা করার পর রাতে ফুর্তি…
তৃণমূল নেতার গাড়িতে বিজেপি নেত্রীর একসঙ্গে মদ্যপানের ভিডিও ভাইরাল…#ChorTMC #Bijemul pic.twitter.com/DCfhsLu7Fb— D Ghosh (@deeghosh) July 10, 2025
Also Read:
Watch: గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్