లక్నో: తమ ప్రాంతంలో కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతున్నదని జనం ఆగ్రహించారు. (Arvind Kumar Sharma) ఆ ప్రాంతానికి వచ్చిన విద్యుత్ మంత్రిని నిలదీశారు. అయితే సమస్యకు పరిష్కారం చెప్పే బదులు ‘జై బజరంగ్ బలి’ అంటూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి అరవింద్ కుమార్ శర్మ గురువారం సురపూర్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా కొందరు స్థానికులు విద్యుత్ మంత్రి అరవింద్ కుమార్ శర్మ వద్దకు వెళ్లారు. తమ ప్రాంతంలో కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
మరోవైపు విద్యుత్ సమస్య పరిష్కారం గురించి మంత్రి అరవింద్ కుమార్ శర్మ ఏమీ మాట్లాడలేదు. పైగా మతపరమైన నినాదాలు చేశారు. ‘బోలియే శంకర్ భగవాన్ కీ జై, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి కీ’ అని అన్నారు. ఆ తర్వాత మెల్లగా కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యుత్ మంత్రి అరవింద్ కుమార్ శర్మ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
यह UP के ऊर्जा मंत्री और PM मोदी के खास AK शर्मा जी हैं। प्रदेश की जनता भयंकर बिजली कटौती से परेशान होकर अपना दुख इन्हें सुना रही है।
लेकिन समस्या का समाधान करने की बजाय मंत्री जी चुपके से गाड़ी में बैठकर भाग गए। pic.twitter.com/NxlaFDKYgW
— AAP (@AamAadmiParty) July 10, 2025
Also Read:
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్
3 Men Rape Woman | మహిళపై ముగ్గురు అత్యాచారం.. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ చోరీ