బెంగళూరు: ముగ్గురు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. (3 Men Rape Woman) డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని బలవంతం చేశారు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ చోరీ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పరప్పన అగ్రహార ప్రాంతం సమీపంలో ఒక మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల కిందట స్నేహితుడు, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తనను బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని, బెట్టింగ్ యాప్లో పందెం కోసం వినియోగించారని ఫిర్యాదులో పేర్కొంది. తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, అలాగే తన ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
కాగా, ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆమె ఆరోపణల్లో నిజానిజాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Forced To Marry Husband’s Nephew | భర్త మేనల్లుడితో.. మహిళకు బలవంతంగా వివాహం
Teachers Make Drugs | స్కూల్కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్