ముంబై: ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి భోజనం కోసం ఇంటికి వస్తున్నట్లు తల్లికి ఫోన్ చేశాడు. కారులో బయలుదేరిన అతడు ఆ తర్వాత వంతెనపై నుంచి నీటిలోకి దూకాడు. (Doctor Jumps Off Bridge) గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల డాక్టర్ ఓంకార్ జేజే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. జూలై 7న రాత్రి వేళ హాస్పిటల్ నుంచి కారులో బయలుదేరాడు. తల్లికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నానని భోజనం చేస్తానని చెప్పాడు. అయితే ఆ రాత్రి 9.40 గంటల సమయంలో ముంబై, నవీ ముంబైను కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అయిన అటల్ సేతు బ్రిడ్జిపై కారు ఆపాడు. ఆ తర్వాత వంతెన పైనుంచి నీటిలోకి దూకాడు.
కాగా, గమనించిన అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వంతెనపై ఆగి ఉన్న కారు, అందులో ఐఫోన్ ఉండటాన్ని గమనించారు. కారు నంబర్ ద్వారా ఆ వ్యక్తిని జేజే హాస్పిటల్లో పని చేస్తున్న డాక్టర్ ఓంకార్‌గా గుర్తించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది పోలీసులు కలిసి రెండు రోజులుగా గాలిస్తున్నారు. డాక్టర్ ఓంకార్ వంతెన పైనుంచి నీటిలోకి ఎందుకు దూకాడు అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్
Man Tears Road By Hand | నాసిరకంగా రోడ్డు నిర్మాణం.. చేతితో పెకలించిన వ్యక్తి