ముంబై: ఒకచోట నాసిరకంగా రోడ్డు నిర్మించారు. నెల రోజుల్లోనే ఆ రోడ్డు గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేతితో ఆ తారు రోడ్డును పెకలించాడు. (Man Tears Road By Hand) దీంతో ఆ రోడ్డు నాణ్యతపై స్థానికులు నోరెళ్లబెట్టారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. నాసిక్ జిల్లాలోని దుగావ్, పూణే జిల్లాలోని డోంగర్గావ్ మధ్య నెల కిందట ఒక రోడ్డును నిర్మించారు.
కాగా, కొన్ని రోజులకే ఆ రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో నాందేడ్ జిల్లాలోని బిలోలి తాలూకాలో ఒక వ్యక్తి ఆ తారు రోడ్డును చేతులతో పెకలించాడు. పొరలు పొరలుగా అది ఊడి వచ్చింది. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. తక్కువ తారుతో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మించడంపై వారు మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:
Himachal floods | కొట్టుకుపోయిన తల్లిదండ్రులు, అమ్మమ్మ.. ప్రాణాలతో బయటపడిన 11 నెలల పసి పాప
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్‌లో నీట మునిగిన బ్యాంకు.. కోట్లలో నష్టం అంచనా