Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్‌లో నీట మునిగిన బ్యాంకు.. కోట్లలో నష్టం అంచనా
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. (Bank Buried In Water) లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు చాలా ప్రసిద్ధి. సమీపంలోని పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది ఖాతాదారులు తమ డబ్బును ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. నగదుతోపాటు నగలు, విలువైన పత్రాలను బ్యాంకు లాకర్లలో దాచుకున్నారు.
కాగా, జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని 23 ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదలకు మండి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తునాగ్ మార్కెట్ ప్రాంతంలోని రెండతస్తుల బిల్డింగ్‌లో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతికి ఒక షట్టర్ పైకి లేచింది. మరో రెండు షట్టర్లు వంకరపోయాయి.
మరోవైపు వరద నీటి వల్ల ఆ బ్యాంకులోని లక్షలాది నగదుతోపాటు లాకర్లలో ఉన్న నగలు, డబ్బు, ఇతర పత్రాలు పాడై ఉంటాయని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. కోట్లలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల ఆ బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు.
Also Read:
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

