లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం చికిత్స పొందుతున్న తల్లి వెంట కుమార్తె ఉన్నది. అదే వార్డులో భార్య చికిత్స కోసం ఉన్న వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతి స్నానం చేస్తుండగా రికార్డ్ చేశాడు. (Man Arrested For Filming Woman Bathing) వాటిని ఆమె ఫోన్‌కు పంపి బ్లాక్మెయిల్ చేశాడు. ఆ యువతి ఫిర్యాదుతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. 20 ఏళ్ల కుమార్తె ఆమెకు సహాయంగా వార్డులో ఉన్నది.
కాగా, ముజఫర్‌నగర్ చెందిన 22 ఏళ్ల వ్యక్తి భార్య క్షయ వ్యాధితో బాధపడుతున్నది. చికిత్స కోసం ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ మహిళ ఉన్న వార్డులోకి ఆ వ్యక్తి వెళ్లాడు. ఆమె కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా రికార్డ్ చేశాడు. ఆ యువతి మొబైల్ నంబర్ సేకరించి ఆ వీడియోలు పంపాడు. తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆ వీడియోలు పబ్లిక్‌గా లీక్ చేశాడు.
మరోవైపు ఆ యువతికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా, గత నెలలో అదే ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు నివారించేందుకు భద్రతా చర్యలను కఠినతరం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
Also Read:
Woman kills mother-in-law | ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. భర్త సోదరులతో వివాహేతర సంబంధం
Watch: రైలు పట్టాలపై ఆటో నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?