పాట్నా: మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు పట్టాలపై ఆటో నడిపాడు. (Drunk Man Drives Auto On Railway Tracks) మరో ట్రాక్‌పై రైలు వస్తున్నది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మద్యంపై నిషేధం ఉన్న బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సీతామర్హిలోని మెహసౌల్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఆటోను నేరుగా రైలు పట్టాలపై నడిపాడు. కొంత దూరంలో మరో ట్రాక్‌పై రైలు వస్తున్నది.
కాగా, ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు పట్టాలపై వెళ్తున్న ఆటోను అడ్డుకున్నారు. ఒంటిపై చొక్కాలేని డ్రైవర్ మద్యం మత్తులో ఆటో నుంచి కిందకు దిగి దాని చుట్టూ తిరిగాడు. స్థానికులు అతడ్ని నిలువరించారు. రైలు పట్టాలపై ఉన్న ఆటోను పక్కకు తొలగించారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नशे में धूत ऑटो ड्राइवर ने रेलवे ट्रैक पर ऑटो दौड़ दिया, वीडियो वायरल
हालाकि घटना स्थल पर मौजूद लोगों की मदद से समय रहते ऑटो को ट्रैक से हटा दिया गया, मामला बिहार के सीतामढ़ी का#BreakingNews #viralvideo #Bihar #Sitamarhi pic.twitter.com/MIvzSSQI4z
— Raman Singh (@RamanSinghX) July 5, 2025
Also Read:
Watch: మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించిన గేదె.. తర్వాత ఏం జరిగిందంటే?
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్