లక్నో: ఒక గేదె మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడ అలజడి సృష్టించింది. (Buffalo On Rage) ఫైళ్లను చెల్లాచెదురుగా పడేసింది. కిటికీ అద్దాలను ధ్వంసం చేసింది. తరిమేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 2న రోడ్డుపై నడిచి వెళ్తున్న గేదె ఉన్నట్టుండి మావానా మున్సిపల్ కార్యాలయం గేట్ నుంచి లోనికి ప్రవేశించింది.
కాగా, మున్సిపల్ ప్రాంగణంలో కొంతసేపు ఉన్న ఆ గేదె తర్వాత కార్యాలయం లోపలకు వెళ్లింది. అక్కడ పెను విధ్వంసం సృష్టించింది. ఫైళ్లను చెల్లాచెదురుగా పడేసింది. కిటికీ అద్దాలను ధ్వంసం చేసింది. తరిమేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేసింది. దీంతో వారు పరుగులు తీశారు. మావానా మున్సిపల్ కార్యాలయంలో సుమారు అరగంట పాటు ఆ గేదె గందరగోళం సృష్టించింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मेरठ – मवाना नगर पालिका ऑफिस में भैंस का उत्पात
➡भैंस ने दफ्तर में रखे गमले तोड़े, फाइलें बिखेरी
➡भैंस ने दफ्तर की खिड़की के शीशे भी तोड़े
➡भैंस ने पालिका कर्मचारी को टक्कर मारी
➡दफ्तर में भैंस के उत्पात का वीडियो वायरल.#meerut @meerutpolice pic.twitter.com/De1S3fQFmx— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 4, 2025
Also Read:
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్
Woman, Lover Arrested | భర్త, పిల్లలకు విషమిచ్చి చంపేందుకు యత్నం.. భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
Black Magic | భార్య, అత్తను నగ్నంగా చేతబడి చేయాలని వ్యక్తి బలవంతం.. ఆ ఫొటోలు లీక్