ముంబై: ఒక వ్యక్తి తన భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి (Black Magic) పూజలు చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారితో ఫొటోలు తీయించాడు. ఆ తర్వాత ఈ ఫొటోలను లీక్ చేశాడు. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న 30 ఏళ్ల వ్యక్తి బావమరిది వివాహం కోసం బట్టలు లేకుండా చేతబడి ఆచారాలు చేయాలని భార్య, అత్తను బలవంతం చేశాడు. అలాగే వారు నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు తీయాలని చెప్పాడు.
కాగా, నవీ ముంబైలో తన ఇంట్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు పలుసార్లు ఇలా అతడు చేయించాడు. ఆ ఫొటోలతో అజ్మీర్ రావాలని భార్యకు చెప్పాడు. భార్య అక్కడకు వెళ్లగా ఆ నగ్న ఫొటోలను ఆమె తండ్రి, సోదరుడికి వాట్సాప్ ద్వారా అతడు పంపాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన బాధిత మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి అని పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, అతడ్ని ఇంకా అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.
Also Read:
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్
live-in couple arrested | నవజాత శిశువుల ఎముకలు లభ్యం.. సహజీవనం చేస్తున్న జంట అరెస్ట్