live-in couple arrested | నవజాత శిశువుల ఎముకలు లభ్యం.. సహజీవనం చేస్తున్న జంట అరెస్ట్
live-in couple arrested | ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు.
తిరువనంతపురం: ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. మృతదేహాల అవశేషాలు, ఎముకలతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. శిశువుల మృతి గురించి తెలుసుకున్న పోలీసులు సహజీవనం చేస్తున్న ఆ జంటను అరెస్ట్ చేశారు. (live-in couple arrested) కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల బవిన్, ల్యాబ్ టెక్నీషియన్ అయిన 23 ఏళ్ల అనీషాకు 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట గత కొన్నేళ్లుగా ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
కాగా, అనీషాకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బవిన్ అనుమానించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న బవిన్ ఆదివారం తెల్లవారుజామున నవజాత శిశువుల అస్థిపంజరాలు, ఎముకలు ఉన్న బ్యాగ్‌తో త్రిస్సూర్‌లోని పుదుకాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అనీషాకు జన్మించిన నవజాత శిశువులకు చెందిన అవశేషాలని తెలిపాడు. మరణించిన శిశువుల ఆత్మలు మోక్షం పొందటం కోసం కర్మకాండలు చేసేందుకు వాటిని భద్రపరిచినట్లు చెప్పాడు.
మరోవైపు ఫోరెన్సిక్ నిఫుణులు ఆ ఎముకలను పరీక్షించారు. నవజాత శిశువులకు చెందినవిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న బవిన్, అనీషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువుల మరణాలపై అనీషాను ప్రశ్నించారు. 2021లో తొలి శిశువు జన్మించినట్లు ఆమె తెలిపింది. అయితే ప్రసవ సమయంలో బొడ్డు తాడు మెడకు చుట్టుకోవడం వల్ల చనిపోయినట్లు ఒకసారి, ఊపిరాడక మొదటి బిడ్డ మరణించినట్లు మరోసారి చెప్పింది.
కాగా, ఇంటి సమీపంలోని స్థలంలో శిశువు మృతదేహాన్ని పాతిపెట్టినట్లు అనీషా తెలిపింది. ఎనిమిది నెలల తర్వాత పాతిన చోట తవ్వి ఎముకలను సేకరించి బవిన్కు ఇచ్చినట్లు ఆమె చెప్పింది. 2024 ఆగస్ట్‌లో జన్మించిన రెండో శిశువును చంపినట్లు ఒప్పుకున్నది. ఆ శిశువు మృతదేహాన్ని కూడా అదే విధంగా మరోచోట పాతిపెట్టినట్లు తెలిపింది. కొన్ని నెలల తర్వాత అక్కడ తవ్వి ఎముకలను బవిన్కు ఇచ్చినట్లు చెప్పింది.
మరోవైపు ఇద్దరు శిశువుల మరణాలకు సంబంధించి బవిన్, అనీషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అనీషా రెండుసార్లు గర్భం దాల్చి పిల్లలను కన్న విషయం ఆమె కుటుంబానికి తెలుసా లేదా అన్నది ఆరా తీస్తున్నారు.
Also Read:
Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

