ఇంఫాల్: కారులో వెళ్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడున్న వృద్ధురాలితో సహా నలుగురిని కాల్చి చంపారు. (Four Shot Dead In Manipur) కుకీ మిలిటెంట్ గ్రూపుల మధ్య శత్రుత్వం వల్ల ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చురాచంద్‌పూర్‌లోని మోంగ్జాంగ్ గ్రామం సమీపంలో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారిపై కుకీ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆ వాహనంలో ఉన్న వారిని చాలా దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆ సమయంలో అక్కడున్న 72 ఏళ్ల మహిళ కూడా ఈ కాల్పుల్లో మరణించింది. మృతులను కుకీ మిలిటెంట్ నేత థెన్ఖోథాంగ్ హవోకిప్ అలియాస్ థాపి, సీఖోగిన్, లెంగౌహావో, ఫాల్హింగ్గా గుర్తించారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న ఖాళీ గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. జాతుల మధ్య ఉద్రిక్తతలకు ఈ కాల్పులకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. కుకీ మిలిటెంట్ గ్రూపుల మధ్య శత్రుత్వం వల్ల ఈ హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన కుకీ మిలిటెంట్ల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు.
Also Read:
Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?