పాట్నా: జలపాతంపైన ఉన్న రాళ్లపై ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. దీంతో ఆ మహిళలు అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ముగ్గురు జారి నీటిలో పడ్డారు. (Women Slip On Top Of Waterfall) జలపాతం వైపు కొట్టుకుపోతున్న వారిని అక్కడున్న వారు కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని గయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లంగురియా జలపాతం అందాలు ఆస్వాదించేందుకు ఆదివారం కొంత మంది సందర్శకులు అక్కడకు వచ్చారు.
కాగా, జలపాతంపైన ఉన్న రాళ్లపైకి ఆరుగురు మహిళలు చేరుకున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి కొండ ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగింది. గమనించిన ఒక మహిళ వెంటనే బండరాయిని దాటి గట్టుకు చేరుకున్నది. మరో ముగ్గురు మహిళలు కూడా ఆమె మాదిరిగానే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్లు దాటే క్రమంలో పట్టుతప్పి నీటిలో పడ్డారు.
మరోవైపు ముగ్గురు మహిళలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడున్న వారు వెంటనే స్పందించి వారిని కాపాడారు. ఐదో మహిళను అవతల గట్టు నుంచి రక్షించారు. జలపాతంపైన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరో మహిళను కూడా కొంతసేపటి తర్వాత స్థానికులు కాపాడారు.
కాగా, జలపాతం అంచువైపు కొట్టుకుపోతున్న ఆ మహిళలను స్థానికులు తక్షణం రక్షించడంతో అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. లంగురియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. మహిళలను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“Bihar’s Gaya: Sudden surge in #waterfall’s water flow nearly drowns six girls; all rescued in time.#bihar #rain #news pic.twitter.com/dbCN6u6xNu
— Amit Singh 🇮🇳❣️ (@KR_AMIT007) June 30, 2025
Also Read:
Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్.. తర్వాత ఏం జరిగిందంటే?