లక్నో: మరో వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో ఆమెతో15 ఏళ్ల వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్నాడు. భార్య, ఆమె ప్రియుడికి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. (Man Organises Wife’s Wedding To Lover) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రసూలాబాద్‌కు చెందిన 40 ఏళ్ల యోగేష్ తివారీ కూలీ పని చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట 30 ఏళ్ల సోనితో అతడికి పెళ్లి జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
కాగా, కన్నౌజ్‌కు చెందిన 35 ఏళ్ల వికాస్ ద్వివేది, సోని మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోని ఇటీవల తన పుట్టింటికి వెళ్లింది. అయితే జూన్ 23న తిరిగి భర్త ఇంటికి చేరుకున్నది. ప్రియుడు వికాస్ కూడా ఆ గ్రామంలో ఉండటాన్ని భర్త యోగేష్ చూశాడు. పోలీసులకు ఫోన్ చేయగా అతడు పారిపోయాడు.
మరోవైపు ఆ తర్వాత వికాస్‌కు యోగేష్ ఫోన్ చేశాడు. పరిస్థితిని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పి గ్రామానికి రప్పించాడు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ సందర్భంగా వికాస్‌ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు సోని చెప్పింది. యోగేష్‌తో 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని రద్దు చేసుకునేందుకు ఆమె అంగీకరించింది. అందరి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేసింది.
కాగా, ఈ సంఘటన తర్వాత యోగేష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భార్య సోని, ఆమె ప్రియుడు వికాస్‌ను పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో వారిద్దరికి పెళ్లి జరిపించాడు. అలాగే తన కుమారుడు భార్యతో ఉండేందుకు అంగీకరించాడు. అయితే తన భద్రత కోసం భార్య, ఆమె ప్రియుడికి పెళ్లి చేసినట్లు యోగేష్ తెలిపాడు. అతడి చర్య పట్ల గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వివాహేతర సంబంధాల వల్ల ప్రస్తుతం పెరుగుతున్న నేరాల నేపథ్యంలో యోగేష్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు.
Also Read:
Man Raping Daughters For 5 Years | ఇద్దరు కుమార్తెలపై.. ఐదేళ్లుగా తండ్రి అత్యాచారం, అరెస్ట్
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్
Woman Killed Buried | కోడలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మామ.. గోతిలో మృతదేహం పూడ్చివేత