అహ్మదాబాద్: హైకోర్టులో జరిగిన లైవ్ స్ట్రీమ్ విచారణకు ఒక వ్యక్తి టాయిలెట్ నుంచి హాజరయ్యాడు. (Man Attends Court Live Stream From Toilet) టాయిలెట్ సీటుపై కూర్చొన్న అతడు జూమ్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూన్ 20న గుజరాత్ హైకోర్టులో చెక్ బౌన్స్ కేసుపై విచారణ జరిగింది. ఈ కేసును రద్దు చేయాలన్న ప్రతివాది పిటిషిన్‌ను గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి నిర్జార్ ఎస్ దేశాయ్ పరిశీలించారు.
కాగా, ప్రతివాది అయిన వ్యక్తి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్‌గా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అయితే టాయిలెట్లో ఉన్న అతడు అక్కడి నుంచే ‘సమద్ బ్యాటరీ’ పేరుతో జూమ్ లైవ్ స్ట్రీమ్‌లో కనిపించాడు. టాయిలెట్ సీటుపై కూర్చొన్న ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ నేలపై ఉంచాడు. బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్ ధరించి కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న అతడు టాయిలెట్ నుంచి మరో గదిలోకి వెళ్లాడు. కోర్టు గదిలో ఉన్న న్యాయవాది అతడి తరుఫున వాదనలు వినిపించాడు.
మరోవైపు ఈ లైవ్ స్ట్రీమ్ కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడిపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు.
A video showing a man attending Gujarat High Court virtual proceedings while seated on a toilet and apparently relieving himself has gone viral on the social media.
Read full story: https://t.co/FbendKMD2M #GujaratHighCourt #VirtualHearings #VideoConferencehearing… pic.twitter.com/spyxMiptiO
— Bar and Bench (@barandbench) June 27, 2025
Also Read:
Gold Stolen From Judge’s Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి.. బంగారం చోరీ
Woman Killed Buried | కోడలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మామ.. గోతిలో మృతదేహం పూడ్చివేత
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు