Harish Shankar | ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఐటమ్ సాంగ్ లేదు.. కారణం చెప్పిన హరీశ్ శంకర్
Harish Shankar | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “గబ్బర్ సింగ్” చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
Harish Shankar | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “గబ్బర్ సింగ్” చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని “కెవ్వు కేక” పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈసారి అదే తరహాలో స్పెషల్ సాంగ్ ఉండబోదని దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కీలక రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆ హోదాకు తగిన గౌరవాన్ని కాపాడుతూ సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు.
ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఐటమ్ గర్ల్ వెనుక తిరుగుతూ పాటలు పాడితే ప్రేక్షకులకు సరైన సందేశం ఇవ్వదు. అందుకే ఈ సినిమాలో ఆ తరహా ప్రత్యేక గీతాన్ని చేర్చలేదు” అని హరీశ్ శంకర్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇమేజ్, ఆయన ప్రస్తుత రాజకీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు సామాజిక సందేశం కూడా ఉండేలా కథను రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే మంచి స్పందన పొందాయి. త్వరలోనే మూడవ సింగిల్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

