Lenin | ఓటీటీలో దూసుకుపోతున్న అఖిల్ ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
Lenin | అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.
Lenin | అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే భారీ రికార్డును సొంతం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఆగస్టు 7 నుంచి ‘లెనిన్’ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఓటీటీలోనూ ‘లెనిన్’ సత్తా చాటుతోందనే చర్చ మొదలైంది.
థియేటర్లలో విడుదలైన సమయంలో ‘లెనిన్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా అఖిల్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఇప్పటివరకు కనిపించని రా అండ్ రస్టిక్ లుక్‌లో అఖిల్ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన వారితో పాటు మరోసారి చూడాలనుకున్న ప్రేక్షకులు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపడంతో జీ5లో సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటడం సినిమాపై ఉన్న ఆసక్తికి నిదర్శనమని చిత్రబృందం చెబుతోంది.
చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్‌కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం అతడి జీవితాన్ని ఎలా మార్చింది? లెనిన్ జైలుకు వెళ్లడానికి కారణం ఏమిటి? రామచంద్రపురంలో చోటుచేసుకున్న ఘర్షణల వెనుక అసలు కథ ఏమిటి? చివరికి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? అనే అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘లెనిన్’లో అఖిల్ అక్కినేని ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన అవతార్‌లో కనిపించారు. రా అండ్ రస్టిక్ లుక్‌తో పాటు పాత్రలోని భావోద్వేగాలను తన నటనతో బలంగా ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌లో అఖిల్ పెర్ఫార్మెన్స్కు మంచి స్పందన వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- collections
- Lenin
- Nagarjuna
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

