ముంబై: మహిళా పోలీస్ అధికారిణి పట్ల బీజేపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (Case Against BJP Leader) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. జూన్ 23న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరైన కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పూణే విభాగం ప్రధాన కార్యదర్శి, ఆఫీసు బేరర్ ప్రమోద్ కొంధ్రే, విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె వెనుక నిల్చొన్న అతడు అసభ్యకరంగా తాకాడు.
కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ వీడియో క్లిప్‌ను పరిశీలించారు. బీజేపీ నేత ప్రమోద్ కొంధ్రేపై లైంగిక వేధింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ నేత ప్రమోద్ కొంధ్రే ఈ ఆరోపణలను ఖండించాడు. అయితే బీజేపీ అతడిపై చర్యలు చేపట్టింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీలోని అన్ని పదవులకు ప్రమోద్ కొంధ్రే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు బీజేపీ పూణే నగర అధ్యక్షుడు ధీరజ్ ఘాటే తెలిపారు. ఆయన దోషిగా తేలితే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
BJP office bearer, Pramod Vitthal Kondhre, allegedly molested a senior police inspector while she was on duty, #BJ party 😡😡😡😡
— KS Sharma ( He / Him ) (@super378) June 25, 2025
Also Read:
Watch: వస్త్ర దుకాణం నుంచి బట్టల ప్యాక్‌లు చోరీ చేసిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?