లక్నో: ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒక బట్టల షాపు వద్దకు వెళ్లాడు. సిబ్బంది బిజీగా ఉండటం చూశాడు. కౌంటర్ వద్ద ఉన్న బట్టల ప్యాక్‌లను మెల్లగా చోరీ చేశాడు. అక్కడి సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. (Cop Caught On Camera Stealing) దీంతో బట్టల షాపు యజమాని ఫిర్యాదుతో ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. మీరట్ ట్రాఫిక్ విభాగంలో ఇన్స్పెక్టర్గా సుమిత్ వశిష్ట్ విధులు నిర్వహిస్తున్నాడు. జూన్ 10న ఒక క్లాత్ షాపు వద్దకు వెళ్లాడు. సిబ్బంది బిజీగా ఉండగా టేబుల్‌పై ఉన్న నాలుగు ప్యాక్‌లను చోరీ చేశాడు. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
కాగా, బట్టల ప్యాక్‌లు కనిపించకపోవడంతో షాపు యజమాని షాక్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. ట్రాఫిక్ పోలీస్ అధికారి సుమిత్ వశిష్ట్ వాటిని చోరీ చేసినట్లు గుర్తించాడు. చోరీ గురించి అడిగిన షాపు యజమానిని అతడు బెదిరించాడు. ఆ షాపు వద్దకు వెళ్లే కస్టమర్లను బెదిరించడంతోపాటు చలాన్లు రాయసాగాడు.
మరోవైపు బట్టల షాపు యజమాని విసిగిపోయాడు. ట్రాఫిక్ పోలీస్ అధికారి సుమిత్ వశిష్ట్‌పై ఫిర్యాదు చేశాడు. చోరీ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను అందించాడు. దీంతో ఎస్ఎస్పీ స్పందించారు. ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. అతడిపై విచారణకు ఆదేశించారు. కాగా, ట్రాఫిక్ పోలీస్ చోరీకి పాల్పడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश –
मेरठ में नजर बचते ही दरोगा जी काउंटर पर रखे कपड़े के 4 बैग उठाकर ले गए। CCTV कैमरे से पोल खुल गई। व्यापारी ने सामान वापसी को कहा तो दरोगा ने उन्हें धमका दिया। मामला SSP तक पहुंच गया। अब दरोगा जी लाइन हाजिर कर दिए गए हैं। pic.twitter.com/3B1wyaKsgj— Sachin Gupta (@SachinGuptaUP) June 23, 2025
Also Read:
Uzbek women | తమను గుర్తించకుండా ఉండేందుకు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఉజ్బెక్ మహిళలు
bomb explosion | ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలుడు.. బాలిక మృతి
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం