లక్నో: ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహిళలు (Uzbek women) పాస్‌పోర్ట్, వీసాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారు. తమ గుర్తింపును దాచేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు ఉజ్బెక్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఉజ్బెకిస్థాన్ జాతీయులైన హోలిడా, నీలోఫర్ రెండేళ్ల కిందట లక్నో వచ్చారు. పాస్‌పోర్ట్‌లు, వీసాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారు. తమను గుర్తించకుండా ఉండేందుకు డాక్టర్ వివేక్ గుప్తా క్లినిక్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
కాగా, ఓమాక్స్ సిటీలోని ఒక ఫ్లాట్‌లో విదేశీ మహిళలు నివసిస్తున్నట్లు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హోలిడా, నీలోఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని ప్రశ్నించగా తమను గుర్తించకుండా ఉండేందుకు డాక్టర్ వివేక్ గుప్తా క్లినిక్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. త్రిజిన్ రాజ్ అలియాస్ అర్జున్ రాణా భారీగా డబ్బులు తీసుకుని దీనికి సహకరించినట్లు చెప్పారు.
మరోవైపు డాక్టర్ వివేక్ గుప్తా, త్రిజిన్ రాజ్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Akhilesh Yadav | ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన ఎస్పీ.. బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపణ
bomb explosion | ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలుడు.. బాలిక మృతి
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం