పాట్నా: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు (Air India Express) చెందిన రెండు విమానాలు లగేజ్ తీసుకురాకుండా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్ అయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగేజ్ మిస్సింగ్‌తో మరో విమానంలో ప్రయాణించే వారితోపాటు ఇతర వేడుకలకు హాజరయ్యేవారు ఇబ్బందిపడ్డారు. శనివారం బెంగళూరు, చెన్నై నుంచి రెండు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఒకే సమయానికి పాట్నా చేరుకున్నాయి.
కాగా, ఎయిర్‌పోర్ట్‌లో ఆ విమానాల ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు తమ లగేజ్‌ను తీసుకునే బెల్ట్ నంబర్ గురించి ఎనౌన్స్ చేశారు. అయితే అక్కడ తమ లగేజ్ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
మరోవైపు అధిక బరువు కారణంగా ప్రయాణికుల లగేజ్‌ను ఆ విమానాల్లో లోడ్ చేయలేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గ్రౌండ్ స్టాఫ్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ లగేజ్ చేరకపోవడంతో కనెక్టింగ్ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులు, ఇతర కార్యక్రమాలు, వేడుకలకు హాజరుకావాల్సిన వారు ఇబ్బందిపడ్డారు.
Also Read:
Air India | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. పలు మార్గాల్లో విమానాలు రద్దు.. కుదింపు..!
Patient Dumped In Garbage | క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధురాలు.. చెత్తకుప్ప వద్ద పడేసిన మనవడు