IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో పనిచేస్తున్న ఒక ట్రైనీ పైలట్‌ను కొందరు అధికారులు కులం పేరుతో దూషించి (Casteism At Work), తీవ్రంగా అవమానించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఇండిగో అధికారులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
షెడ్యూల్ కులానికి చెందిన 35 ఏళ్ల ట్రైనీ పైలట్‌పై కొందరు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్.. కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించారు. ‘నువ్వు విమానం నడిపేందుకు అనర్హుడివి.. వెళ్లి చెప్పులు కుట్టుకో (Stitch Shoes)’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో బాధితుడు బెంగళూరు పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ఇండిగో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్‌కు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ముగ్గురు అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసులు నమోదు చేశారు.
Also Read..
Mumbai Local Trains | 11 ఏండ్లలో 29 వేల మందిని బలి తీసుకున్న ముంబై లోకల్ రైళ్లు
ఈ ఏడాది లక్ష మంది టెకీలపై వేటు!.. ఇప్పటికే 62 వేల మందికిపైగా ఇంటికి!