నిలువ నీడేది.. ఎండలోనే గార్డుల డ్యూటీ
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది.
రుద్రంపూర్, మార్చి 12 : గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ముఖ్యంగా జీఎం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు వద్ద ఎండలో డ్యూటీలో ఉన్న గార్డులు 8 గంటల పాటు నిలబడే పని చేయాల్సి వస్తుండగా, అక్కడ కనీసం నిలువ నీడ కూడా లేకపోవడంతో తామెక్కడ అస్వస్థతకు గురౌతామోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“గేటును కాపాడుతున్నాం.. కానీ మాకు కాపాడే నీడ లేదు” అంటూ సెక్యూరిటీ గార్డులు తమ పరిస్థితిని వివరించి వాపోతున్నారు. వేసవికాలం ముగిసేంత వరకైనా జీఎం కార్యాలయం వద్ద చలువ పందిర్లు ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం ఉంటుందని వారు కోరుతున్నారు. ప్రత్యేకంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కనీసం తాత్కాలికంగా చలువ పందిరులు లేదా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సెక్యూరిటీ సిబ్బంది వేడుకుంటున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

