అదే విజయానికి కొలమానం
‘ఈ సినిమా ప్రీమియర్షోస్ పూర్తయిన దగ్గరి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు పత్రికాధిపతులు కూడా ఫోన్ చేసి గొప్ప సినిమా తీశారని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ఎవరూ లేరు.
‘ఈ సినిమా ప్రీమియర్షోస్ పూర్తయిన దగ్గరి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు పత్రికాధిపతులు కూడా ఫోన్ చేసి గొప్ప సినిమా తీశారని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ఎవరూ లేరు. అన్నీ హృదయాన్ని కదిలించే పాత్రలే ఉన్నాయి’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
ఇంకా ఆయన చెబుతూ ‘దర్శకుడు పవన్ సాధినేని తన తదుపరి చిత్రాన్ని మా బ్యానర్లోనే చేయబోతున్నాడు. అతని వర్క్ అంతలా నచ్చింది. ఈ సినిమాకు ఓవర్సీస్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. దుల్కర్ సల్మాన్ తన పాత్రలో జీవించారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి పెద్దస్టార్ అయిపోయింది. ఆమె మా సంస్థలో రెండు సినిమాలు చేయబోతున్నది’ అన్నారు. అల్లు అరవింద్‌తో కలిసి ఎన్నో సినిమాలు చేశానని, ఈ విజయం చాలా ప్రత్యేకమని నిర్మాత అశ్వనీదత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రీమియర్షోస్ నుంచి తన ఫోన్ మోగుతూనే ఉందని, అదే ఈ సినిమా విజయానికి కొలమానమని, ఈ సినిమా విషయంలో తమ నమ్మకం నిజమైందని దర్శకుడు పవన్ సాధినేని ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

