తాగునీటి సరఫరాలో అంతరాయం
సూరారం చెరువు నుంచి శివాలయనగర్లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ వరకు చేపట్టిన 800 ఎంఎం సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం తాగునీటి పైప్‌లైన్ మార్పిడి పనులు చేపడుతున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సూరారం చెరువు నుంచి శివాలయనగర్లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ వరకు చేపట్టిన 800 ఎంఎం సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం తాగునీటి పైప్‌లైన్ మార్పిడి పనులు చేపడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. సూరారం ప్రధాన రహదారిలో మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా 700 ఎంఎం డయా తాగునీటి పైప్ లైన్ మార్చే పనులను శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సూరారం వార్డులోని విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామంతో పాటు సాయిబాబా నగర్ వార్డులోని తెలుగు తల్లి నగర్, జై భీమ్‌నగర్, మైత్రీనగర్, సూరారం కాలనీలో అంతరాయం ఏర్పడనున్నట్లు స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

