న్యూఢిల్లీ, జూన్ 22: టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత ఈ ఏడాది కొనసాగుతున్నది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్‌ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 62 వేల మందికిపైగా ఇంటికి పంపాయి.
ఇప్పటికే ప్రకటించిన లేఆఫ్‌లను పరిశీలిస్తే ఈ ఏడాది తొలగించబోయే ఉద్యోగుల సంఖ్య లక్ష దాటింది. ప్రధాన టెక్ కంపెనీలన్నీ తమ వ్యాపార సరళి, నిర్వహణలో అనూహ్య మార్పులను చేపడుతుండటంతో, సెమికండక్టర్ తయారీ రంగం నుంచి సోషల్‌మీడియా రంగం వరకు ఉద్యోగాల తొలగింపు మొదలైంది.
దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది పోటీ ప్రపంచంలో కొత్త అవకాశాల కోసం వెదుక్కునే పరిస్థితి ఏర్పడింది. హార్డ్‌వేర్ ఉత్పత్తులను తయారుచేసే ఇంటెల్, ఫిన్‌టెక్ కంపెనీ బ్లాక్, బ్లూ ఆరిజన్ వంటి స్పేస్ కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకునే ప్రణాళికను ప్రకటించాయి. ఈ ఏడాది ఆయా టెక్ కంపెనీలు తొలగిస్తున్న ఉద్యోగుల సంఖ్య ఈ విధంగా ఉంది.