Mumbai Local Trains | 11 ఏండ్లలో 29 వేల మందిని బలి తీసుకున్న ముంబై లోకల్ రైళ్లు
ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగా రైలు ప్రమాదాల్లో మరణించారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో సబర్బన్ రైల్వే వ్యవస్థ (Mumbai Local Trains) అత్యంత ప్రధానమైనవి. ఉరుకులుపరుగుల జీవనం గడిపే కోట్లాది మంది రవాణా కష్టాలను లోకల్ రైళ్లు తీరుస్తాయి. నిత్యం రద్దీగా ఉంటే ఈ రైళ్లు.. ఉదయం, సాయంత్రం వేళల్లో జనంతో కిక్కిరిసిపోతాయి. కనిసం నిలబడటానికి కూడా జాగా లేక ప్రజలు వేలాడబుతూ ప్రయాణాలు చేయడం సర్వసాదారణం. అయితే ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగా రైలు ప్రమాదాల్లో మరణించారు. వారిలో 8,416 మంది బాధితులను ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2014 నుంచి 2024 వరకు ముంబై సబర్బన్ రైల్వే పరిధిలో మొత్తం 29,048 మంది మరణించాని ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) గణాంకాలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు అంటే 15 వేల మందికిపైగా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక కిక్కిరిసిన రైళ్లలో వేలాడుతూ ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తు కిందపడి 6500 మంది చనిపోయారు. రైల్వే పట్టాలు దాటుతూ చనిపోయేవారే అధికంగా ఉంటున్నారని జీఆర్పీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కావడంతో బాధితులను గుర్తించడం కష్టసాధ్యమవుతున్నదని తెలిపారు.

ముంబై సబర్బన్ రైల్వేలో వెస్ట్రన్ లైన్, సెంట్రల్ లైన్ మరియు హార్బర్ లైన్ అనే మూడు ప్రధాన మార్గాలున్నాయి, ఇవి నగరం నలుమూలలా ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. లోకల్ రైళ్లు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడుస్తాయి. కొన్ని మార్గాల్లో తెల్లవారుజామున 2.30 లేదా 3 గంటల వరకు కూడా సేవలు అందిస్తాయి. కాగా, సబర్బన్ రైల్వేలో అత్యంత పొడవైన మార్గం పన్వేల్ నుంచి దహాను రోడ్ వరకు ఉంది. ఈ మెము రైల్వే లైను 131 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో 21 స్టాప్‌లు ఉంటాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

