Air India | ఎయిర్ ఇండియా పలు మార్గాల్లో విమానాలను కుదిస్తున్నట్లు ప్రకటించింది. జులై 15 వరకు వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. ఆపరేషనల్ స్టేబిలిటీతో పాటు చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రయాణికులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా మూడు రూట్లలో మొత్తం సేవలను నిలిపివేసింది. మరో 19 రూట్లలో విమానాల సంఖ్యను భారీగా తగ్గించింది. ఈ మార్పులు ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా నారోబాడీలో రోజుకు దాదాపు 600 విమానాలను నడుపనున్నది. ఈ నిర్ణయంతో 120 దేశీయ, స్వల్ప-దూర అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలు ప్రభావితం కానున్నది. బెంగళూరు–సింగపూర్ (AI2392/2393) , పుణే–సింగపూర్ (AI2111/2110), ముంబయి–బాగ్డోగ్రా (AI551/552) విమానాలును జులై 15 వరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.
ఈ నిర్ణయంపై ఎయిర్ ఇండియా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. విమానాలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రయాణికులను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. వారికి ప్రత్యామ్నాయ విమానాల్లో రీబుకింగ్, ఫ్రీ రీషెడ్యూల్, డబ్బులు వాపస్ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొత్త షెడ్యూల్ను వెబ్సైట్, మొబైల్ యాప్, కాంటాక్ట్ సెంటర్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. విమానాల కుదింపు తాత్కాలికమేనని.. వీలైనంత త్వరగా పూర్తి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణీకులు, సిబ్బంది, విమానాల భద్రతను ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తామని.. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఇదేనని ఎయిర్ ఇండియా వివరించింది.
Following previous announcements of temporary reductions in Air India’s widebody international services, the airline today announced temporary cuts of less than 5% to its overall narrowbody network.
This voluntary decision leads to the temporary suspension of…
— Air India (@airindia) June 22, 2025