ముంబై: క్యాన్సర్‌తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలి పట్ల ఆమె కుటుంబం దారుణంగా ప్రవర్తించింది. మనవడు ఆమెను చెత్తకుప్ప వద్ద పడేశాడు. (Patient Dumped In Garbage) గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఆరే కాలనీలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్ప దగ్గర 60 ఏళ్ల వృద్ధురాలు పడి ఉన్నది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఇది కలకలం రేపింది.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వృద్ధురాలిని యశోద గైక్వాడ్‌గా గుర్తించారు. స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తనను మనవడు చెత్తకుప్ప వద్ద పడేసినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. తన కుటుంబ సభ్యులు మలాడ్, కాండివాలిలో నివసిస్తున్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ఫొటోను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపారు.
మరోవైపు చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని హాస్పిటల్లో చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి అడ్మిట్ చేసుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. చివరకు శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఆ వృద్ధురాలిని కూపర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వృద్ధురాలిని చెత్తకుప్ప వద్ద మనవడు ఎందుకు పడేశాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Mumbai Local Trains | 11 ఏండ్లలో 29 వేల మందిని బలి తీసుకున్న ముంబై లోకల్ రైళ్లు
By-election | బీజేపీకి షాక్.. విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆప్ ఘన విజయం