హైదరాబాద్: ఫిల్మ్ స్టార్ నీనా గుప్తా(Neena Gupta) 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై మాజీ నటి స్పందించారు. ఆ రూమర్స్‌కు ఆమె తనదైన స్టయిల్లో చెక్ పెట్టారు. కాస్త వెటకారంగానే ఆమె ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇటీవల విజయదేవరకొండ-రష్మిక రిసెప్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ వేడుకలో పాల్గొన్న ఆమె ఓ వెరైటీ చీరలో దర్శనమిచ్చారు. అక్కడ తీసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అయితే ఆ చీర కట్టులో నీనా గుప్తాకు కాస్త బేబీ బంప్ ఉన్నట్లు నెటిజన్లు అనుమానించారు. ఆమె ప్రెగ్నెంటా అని కొందరు ఇన్‌స్టాలో అడిగేశారు.
అయితే రూమర్స్‌పై ఆమె మాట్లాడుతూ ఇది రియల్ లైఫ్ బదాయి హో కాదని చెప్పారు. తానేమీ ప్రెగ్నెంట్ కాదన్నారు. శారీ మెటీరియల్ మందంగా ఉండడం వల్ల తన వీడియోలో కడుపుతో ఉన్నట్లు కనిపించానన్నారు. బదాయ్ హో హిందీ చిత్రంలో హీరో తల్లిగా నటించిన నీనా గుపా.. ఆ ఫిల్మ్‌లో లేటు వయసులో గర్భం దాల్చుతుంది. అయితే ఆ ఫిల్మ్‌ను ప్రస్తావిస్తూ ఇదేమీ బదాయ్ హో కాదన్నారు. తనపై వచ్చిన రూమర్స్ విషయంలో ఆమె ఓ జోకేశారు. ఇలాంటి ఊహాగానాలు మన దగ్గర వినిపించాలన్నారు. ఈ ఏజ్‌లో ప్రెగ్నెంట్ అవ్వడం లాంటి అంశాలను తాను ఇష్టపడుతానన్నారు. మన దేశం ఎంతో ఎదుగుతోందన్నారు.
1980లో నీనా గుప్తా .. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో రిలేషన్లో ఉన్నది. ఆ జంటకు ఓ కుమార్తె ఉన్నది. ఆమె మసాబా గుప్తా. ఆ తర్వాత 2008లో ఆమె ఢిల్లీ వ్యాపారి వివేక్ మెహ్రాను నీనా పెళ్లాడిన విషయం తెలిసిందే.