న్యూయార్క్: అమెరికాకు చెందిన రీఫ్యుయలింగ్ విమానం .. ఇరాక్ గగనతలంలో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనలో నలుగురు మృతిచెందినట్లు ఇవాళ యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆరు మంది సిబ్బందిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సెంట్రల్ కమాండ్ తన ట్వీట్లో వెల్లడించింది. కేసీ-135 విమానం రీఫ్యుయలింగ్ చేస్తున్న సమయంలో కూలింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. అయితే మరో విమానం మాత్రం సేఫ్గా ల్యాండ్ అయినట్లు సెంట్రల్ కమాండ్ చెప్పింది. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రీఫ్యుయలింగ్ విమానం ఎందుకు కూలిందన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు అమెరికా మిలిటరీ అధికారులు చెప్పారు. అయితే శత్రు దేశమో లేక స్నేహపూర్వక ఫైరింగ్లో ఆ విమానం కూలలేదని మాత్రం అధికారులు వెల్లడించారు. కుటుంబసభ్యులకు వెల్లడించే వరకు బాధితుల వివరాలను చెప్పబోమని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది.
Four Confirmed Deceased in Loss of U.S. KC-135 Over Iraq
TAMPA, Fla. – At approximately 2 pm ET on March 12, a U.S. KC-135 refueling aircraft went down in western Iraq. Four of six crew members on board the aircraft have been confirmed deceased as rescue efforts continue.
The…
— U.S. Central Command (@CENTCOM) March 13, 2026