చుంచుపల్లి, జూలై 30 : చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ప్రతాప్ గురువారం సందర్శించారు. ఆస్పత్రిలోని ల్యాబ్, ఫార్మసీ, వార్డులు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సెక్టార్ సమావేశంలో పాల్గొని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వాడేపల్లి రమేష్, హైమద్ పెనగడప ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను డీఎంఅండ్‌హెచ్‌వో తుకారం వారిని అభినందించారు. ఈ శిబిరంలో 50 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఎన్.సురేష్ రెడ్డి, పెనగడప గ్రామ సర్పంచ్ సీతారాములు, బ్లడ్ ఫౌండర్స్ బాలు, కన్న, సంస్థ కార్యదర్శి సురేష్, వైద్యాధికారి డాక్టర్ హరి, బీఆర్ఎస్ నాయకులు అనుదీప్, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ సభ్యులు, పీహెచ్సీ వైద్య సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెనగడప ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం