అనంతగిరి, జూలై 30 : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఎం.ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ప్రజలకు అందుబాటులో ఉండేలా అమలు చేస్తామన్నారు. ప్రజలు తమకు సహకరించి అనుమానాస్పద ఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.