ముంబై: దొంగలు రెండు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ఆలయంలోని హుండీ చోరికి ముందు ఒక దొంగ దేవతకు మొక్కి క్షమాపణ చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Thief Apologising To Deity) మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 27న రాత్రి వేళ మల్‌ధక్కా ప్రాంతంలోని శీతలా మాత ఆలయం, శివాలయంలో దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఆలయాల్లోకి ప్రవేశించారు. హుండీని పగులగొట్టారు. అందులోని కానుకల డబ్బును దొంగిలించారు. హుండీ చోరికి ముందు ఒక దొంగ దేవతకు మొక్కి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఆలయ ప్రాంగణానికి వేసిన తాళం పగిలి ఉండటాన్ని మరునాడు ఉదయం ఆలయ సంరక్షకుడు గమనించారు. రెండు ఆలయాల్లోని హుండీ డబ్బులు చోరీ అయ్యినట్లు గ్రహించారు. ఆలయాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దీనిని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆలయంలోని హుండీ చోరికి ముందు ఒక దొంగ దేవతకు మొక్కి క్షమాపణ చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Nagpur – A theft of the donation box at the Sheetla Mata Temple in Lakadganj area of Nagpur has come to light.Two accused entered the temple and broke open the donation box. CCTV footage captured one of the accused folding his hands and seeking the goddess’s forgiveness before… pic.twitter.com/DY36X9WluO
— NextMinute News (@nextminutenews7) July 30, 2026