కోల్‌కతా: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలింది. (bomb explosion) ఈ సంఘటనలో ఒక బాలిక తీవ్రంగా గాయపడి మరణించింది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బరోచంద్గర్ గ్రామంలో నాటు బాంబు పేలింది. 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సంఘటనపై స్పందించారు. బరోచంద్గర్లో జరిగిన పేలుడులో ఒక యువతి మరణించడం పట్ల దిగ్భ్రాంతి చెందినట్లు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్ కోసం పోలీసులు చట్టపరమైన చర్యలు చేపడతారని అన్నారు.
మరోవైపు టీఎంసీ విజయోత్సవం సందర్భంగా బాంబులు విసరడంతో బాలిక మరణించిందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. ‘టీఎంసీ విజయోత్సవాలు మళ్లీ రక్తంతో ముగిశాయి’ అని ఎక్స్‌లో విమర్శించారు. కలిగంజ్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్, ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఆశిష్ ఘోష్‌పై 50,049 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.
Also Read:
Akhilesh Yadav | ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన ఎస్పీ.. బీజేపీతో సంబంధాలున్నాయని ఆరోపణ
Watch: రేషన్ కోసం గేటు తోసుకెళ్లిన జనం.. తోపులాటలో కొందరికి గాయాలు
Patient Dumped In Garbage | క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధురాలు.. చెత్తకుప్ప వద్ద పడేసిన మనవడు