రాయ్‌పూర్: మూడు నెలల రేషన్ పొందేందుకు జనం ఇబ్బందిపడుతున్నారు. సాంకేతిక లోపం వల్ల మిషన్లు మెరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కోసం వేచి ఉన్న జనం గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ తోపులాటలో కిందపడిన కొందరు వ్యక్తులు గాయపడ్డారు. (People Break Open Gate) ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్రం నిర్ణయం మేరకు మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు.
కాగా, రేషన్ పంపిణీ మిషన్‌లో సమస్యలు, సర్వర్ లోపాలు, వేలిముద్రలు, ఓటీపీ సమస్యల వల్ల రోజుకు కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే రేషన్ పొందుతున్నారు. దీంతో క్యూలో ఉన్నవారు నిరాశతో తిరిగివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు చోట్ల తోపులాట, తొక్కిసలాటలు జరిగాయి. ఒక ప్రభుత్వ రేషన్ షాపు వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కిందపడటంతో గాయపడ్డారు. ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ये हमारे देश की जनता है और ये छत्तीसगढ़ का गरियाबंद है, ऐसे गेट खुलते ही भागने को मजबूर हैं क्योंकि नई मशीन है, 3 महीने का राशन साथ मिलना है एक दिन में बमुश्किल 20-22 लोगों को राशन मिल रहा है pic.twitter.com/t4oCkYracN
— Anurag Dwary (@Anurag_Dwary) June 23, 2025
Also Read:
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం
Patient Dumped In Garbage | క్యాన్సర్‌తో బాధపడుతున్న వృద్ధురాలు.. చెత్తకుప్ప వద్ద పడేసిన మనవడు