మునుగోడు, మార్చి 07 : మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థిని, విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాల్య దశలోనే సమాజంలోని వివిధ ఉన్నతమైన పదవుల నిర్వహణను అనుభవంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమమే స్వపరిపాలన అన్నారు. విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాల నిర్వహణ గురించి విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.సత్తిరెడ్డి, దేవిశెట్టి వెంకటేశ్వర్లు, సదాలక్ష్మి, కె.రత్నయ్య, పి.వెంకట్ రెడ్డి, స్వామి రెడ్డి, సబిత, చంద్రం, రాజేశ్వర్ పాల్గొన్నారు.

మునుగోడు జడ్పీహెచ్ఎస్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం