నేడు విద్యుత్తు ఉద్యోగుల మహాధర్నా
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతోపాటు పీఆర్సీ తదితర 14 డిమాండ్ల సాధన కోసం విద్యుత్తు ఉద్యోగులు ధర్నాకు సిద్ధమయ్యారు. ‘చలో హైదరాబాద్' పేరుతో బుధవారం విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
- పాల్గొనవద్దని టీఎస్ జెన్కో ఆదేశాలు
- ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతోపాటు పీఆర్సీ తదితర 14 డిమాండ్ల సాధన కోసం విద్యుత్తు ఉద్యోగులు ధర్నాకు సిద్ధమయ్యారు. ‘చలో హైదరాబాద్’ పేరుతో బుధవారం విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్తు సంస్థల ఉద్యోగులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీన్ర్ రత్నాకర్‌రావు మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు పెద్దఎత్తున హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తాము యాజమాన్యానికి నోటీసులిచ్చినా స్పందన కరువైందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మహాధర్నాకు పూనుకున్నట్టు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
- ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీ-2026ను ఏర్పాటుచేయాలి.
- వైటీపీస్లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, ఓఅండ్ఎంను ఔట్సోర్సింగ్ చేయడాన్ని ఉపసంహరించుకోవాలి.
- ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్‌రూల్స్‌ను అమలుచేయాలి. అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా బదలాయించాలి.
- 1999 నుంచి 2004 మధ్య నియమించిన ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
- ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలి.
- మహారాష్ట్ర మాడల్ ప్రకారం రైతు డిస్కమ్‌ను ఏర్పాటుచేయాలి.
- సీలింగ్ పరిమితి లేకుండా ఈపీఎఫ్ ఉద్యోగులకు యాజమాన్య వాటా చెల్లించాలి.
- ఈపీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.
- అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి. సాధారణ బదిలీలు చేపట్టాలి.
- ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో సబ్‌స్టేషన్, షిప్ట్ ఆపరేటర్ పోస్టులను మంజూరుచేసి నియామకాలు చేపట్టాలి.
- 2022 వేతన సవరణలోని పే స్కేల్స్లోని లోపాలు సవరించాలి.
- టీజీ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మెరుగుపర్చాలి.
ధర్నాలో పాల్గొంటే చర్యలు : జెన్కో
టీజీపీఈజేఏసీ తలపెట్టిన మహాధర్నాలో ఉద్యోగులెవరూ పాల్గొనవద్దని టీజీ జెన్కో సూచించింది. పాల్గొన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. విద్యుత్తు సౌధ, విద్యుత్తు జనరేటింగ్ స్టేషన్లు, హైదరాబాద్‌లోని కార్యాలయాలు, జీటీఎస్ కాలనీలోని ఈఆర్పీ కంపిటెన్సీ సెంటర్ పరిధిలోని ఉద్యోగులు ఎలాంటి నిరసనలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని గతంలోనే ఉత్తర్వులిచ్చినట్టు జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్‌రాజా ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

