బీజింగ్: ఒక వ్యక్తి కత్తితో 22 సార్లు మహిళను పొడిచాడు. (Woman Stabbed 22 Times Survives) అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. బ్రెస్ట్ ఇంప్లాంట్లు కత్తి పోట్ల నుంచి ఆమెను కాపాడాయి. చైనాలో ఈ సంఘటన జరిగింది. మే 22న ఆగ్నేయ చైనాలోని ఒక షాపింగ్ మాల్ బయట మా ఇంటి పేరున్న మహిళ పార్క్ చేసిన కారులోకి ఎక్కుతున్నది. ఇంతలో ఒక వ్యక్తి బలవంతంగా ముందు సీటులోకి వచ్చాడు. పార్కింగ్ రుసుం చెల్లించాలని డిమాండ్ చేశాడు. పొరుగున ఉన్న కౌంటీకి కారులో తీసుకెళ్లాలని బెదిరించాడు. సహాయం కోసం ఆ మహిళ అరిచినప్పటికీ అక్కడున్న వారెవరూ పట్టించుకోలేదు.
కాగా, కారులో వెళ్తుండగా ఆ మహిళ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఆ వ్యక్తి చెక్ చేశాడు. ఆమె స్నేహితులను డబ్బులు అడగాలని డిమాండ్ చేశాడు. మార్గమధ్యలో అతడి కళ్లగప్పిన ఆ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్ చేసింది. దీంతో ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను అతడు ట్రాక్ చేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మరోవైపు పోలీసులు ఆ కారు వద్దకు చేరుకునేలోపు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఆ మహిళపై కత్తితో దాడి చేశాడు. ఆమె ఛాతిపై 22 సార్లు పొడిచాడు. పోలీసులు అక్కడకు చేరుకోగా కత్తితో తనను పొడుచుకుని చనిపోయాడు. అయితే దారుణ కత్తిపోట్ల నుంచి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమె గతంలో చేయించుకున్న బ్రెస్ట్ ఇంప్లాంట్లు కత్తి పోట్ల గాయాన్ని అడ్డుకున్నాయి.
కాగా, ఆ వ్యక్తి పొడిచిన 20కు పైగా కత్తిపోటు గాయాల్లో ఒకటి మాత్రమే ఆమె ఊపిరితిత్తులకు చేరిందని డాక్టర్లు తెలిపారు. చికిత్స తర్వాత ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే తనపై దాడి చేసిన వ్యక్తి మరణించడంతో పోలీసులు కేసు క్లోజ్ చేయడంపై ఆ మహిళ అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘బ్రెస్ట్ ఇంప్లాంట్ల వల్ల ఇలాంటి ప్రయోజనం కూడా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అని ఒకరు కామెంట్ చేశారు.
Also Read:
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం
Income Tax Raids: హత్యకు గురైన మాజీ మంత్రి నివాసాల్లో ఐటీ సోదాలు.. 20 చోట్ల తనిఖీలు