లక్నో: ఒక ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. (Calf Born With 2 Heads) దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ దూడకు కొందరు పూజలు కూడా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 18న టిక్రీ గ్రామానికి చెందిన జాహిద్ పెంచుతున్న ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. ఇది చూసి జాహిద్ ఆశ్చర్యపోయాడు.
కాగా, ఈ విషయం తెలిసిన స్థానికులు ఆ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండు తలలు, మూడు కళ్లతో పుట్టిన అరుదైన దూడను చూసేందుకు ఎగబడ్డారు. పైకి లేవలేకపోతున్న ఆ దూడకు కొందరు వ్యక్తులు పూజలు చేశారు. మరికొందరు డబ్బులు కూడా ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు రెండు తలలున్న ఆవు లేక దూడను పాలీసెఫాలీ అని పిలుస్తారని పశువైద్యులు తెలిపారు. పిండం అసంపూర్ణంగా విడిపోవడం లేదా రెండు పిండాల కలయిక కారణంగా ఇలా జరుగుతుందని చెప్పారు. చాలా అరుదుగా రెండు తలలతో పుట్టే దూడలు స్వల్ప కాలం మాత్రమే జీవించే అవకాశమున్నదని వెల్లడించారు.
बागपत
➡गाय ने दिया अद्भुत बछड़े को जन्म
➡दो मुंह और तीन आंख वाला बछड़ा
➡बछड़े को देखने के लिए ग्रामीणों की भीड़
➡दोघट थाना के टीकरी गांव का मामला.#Baghpat @Dept_of_AHD pic.twitter.com/33UO8IPedH— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 19, 2025
Also Read:
Income Tax Raids: హత్యకు గురైన మాజీ మంత్రి నివాసాల్లో ఐటీ సోదాలు.. 20 చోట్ల తనిఖీలు
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Air India | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్.. విశ్లేషణ కోసం విదేశాలకు